- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంబి, ఇటిక్యాల తండాల పై ఎక్సైజ్ దాడులు
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని రెండు తండాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని రెండు తండాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ సీఐ గంగారెడ్డికి అందిన పక్కా సమాచారంతో నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సీఐ, ఎస్‌ఐలు బృందంగా ఏర్పడి పెంబి మండలంలోని పెంబి తండా, ఇటిక్యాల తండాల్లో గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో అధికారులు భారీగా 500 లీటర్ల బెల్లపు పానకాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే సారా స్వేదనం కోసం సిద్ధంగా ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గుడుంబా తయారీదారులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, జిల్లాలో గుడుంబా నియంత్రణకు మరిన్ని ప్రత్యేక దాడులు నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.






