- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ ఆందోళనలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. హైజాక్ చేస్తున్నారంటూ ఆరోపణలు!
దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పరీక్షల అంశంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పరీక్షల అంశంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలపై జరుగుతున్న ఆందోళనలను కొన్ని విభజన శక్తులు హైజాక్ చేసి, ప్రజాస్వామ్య నిరసనలను హింసాత్మక దిశగా మళ్లించే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే నిరసనలకు తాను ఎల్లప్పుడూ మద్దతు ఇస్తానని, అయితే దేశ వ్యతిరేక నినాదాలు, దేశ సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దేశ సమగ్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్న ఆయన, విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.






