- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన లబ్ధిదారులకు రాయితీలు సత్వరమే మంజూరు చేయాలి : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా
అర్హులైన లబ్ధిదారులకు రాయితీలను సత్వరమే మంజూరు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా సంబంధిత అధికారులను ఆదేశించారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : అర్హులైన లబ్ధిదారులకు రాయితీలను సత్వరమే మంజూరు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం కమిటీ సభ్యులతో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారుల దరఖాస్తులు టీజీ ఐపాస్ ద్వారానే అందాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు గూడ్స్ వాహనాలకు సంబంధించిన రాయితీల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు రాయితీలు మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
అలాగే, కమిటీ సభ్యులు లబ్ధిదారుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అంతకుముందు ఎంఎస్‌ఎంఈ (MSME) పథకం కింద వివిధ బ్యాంకుల ద్వారా మంజూరైన వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, సబ్సిడీ వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీఎం జిల్లా పరిశ్రమల కేంద్రం గణేష్ రామ్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ చరణ్ దాస్, ఎల్‌డీఎం మూర్తి, డిప్యూటీ సీఎఫ్‌ఐ ఫ్యాక్టరీస్ వైదేహి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సురేష్, ఏఎంవీఐ జాన్ రోనాల్డ్, టీజీఐఐసీ అధికారి అనురాధ, వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






