- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్ర సృష్టించిన వైభవ్.. 37 ఏళ్ళ సచిన్ రికార్డు బద్దలు!
జింబాబ్వే పై అర్ధ సెంచరీ చేసి, చరిత్ర సృష్టించాడు వైభవ్.

దిశ, వెబ్ డెస్క్: 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఫుల్ మెంబర్ టీమ్స్ పై అర్థ సెంచరీ నమోదు చేసిన కుర్ర క్రికెటర్ గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 15 సంవత్సరాల 118 రోజుల్లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్తాన్ పై సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల వయసులో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు వైభవ్. ఇక ఇప్పుడు వైభవ్, సచిన్ తర్వాత షాహిద్ అఫ్రిది, ముస్తాక్, మహమ్మద్ అష్రఫూల్ ఉన్నారు.
జింబాబ్వే పై 18 బంతుల్లో అర్థ సెంచరీ
భారత్, జింబాబ్వే మధ్య హరారే వేదికగా తొలి టీ20 జరిగింది. ఇందులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ నమోదు అయిన తర్వాత వెంటనే ఔట్ అయ్యాడు వైభవ్. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ఫినిష్ చేశాడు.






