- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన వారిని గుర్తించి ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలి : ఫారూఖ్ అహ్మద్
అర్హులైన సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ పరిధిలోకి రావడానికి మరోసారి అవకాశం కల్పించాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేసింది.

దిశ, హైదరాబాద్ బ్యూరో : అర్హులైన సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ పరిధిలోకి రావడానికి మరోసారి అవకాశం కల్పించాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1కు ముందు నియామకానికి ఎంపికై, పలు కారణాల వల్ల నియామక ఉత్తర్వులు ఆలస్యంగా అందుకున్న ఉద్యోగులను గుర్తించి ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
ఇదే విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ పరిధిలో ఉన్న అర్హులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనాన్ని విస్తరిస్తూ ఈ నెల 13వ తేదీన జి.ఓ.ఎం.ఎస్. నెం. 53ను జారీ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని, 2004 సెప్టెంబర్ 1కు ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా చాలా మంది ఉద్యోగులు ఎంపికయ్యారని, అయితే పరిపాలనా కారణాల వల్ల వారికి నియామక ఉత్తర్వులు ఆలస్యంగా అందడంతో ప్రస్తుతం వారు సీపీఎస్ పరిధిలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం పునరాలోచించి, 2004 సెప్టెంబర్ 1కు ముందు ఉద్యోగాలకు ఎంపికై, అనంతరం నియామక ఉత్తర్వులు పొందిన ఉద్యోగులను గుర్తించి, వారిని ఓపీఎస్ పరిధిలోకి తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.






