- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాంద్రాయణగుట్టలో గంజాయి విక్రయాల పై ఎస్‌టీఎఫ్ ఉక్కుపాదం
నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) ఉక్కుపాదం మోపుతోంది.

దిశ, చంపాపేట్ : నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట ప్రాంతంలో గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌టీఎఫ్ ‘ఏ’ టీమ్ అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఎస్‌టీఎఫ్ ‘ఏ’ టీమ్ సీఐ ఎం.ఆర్.పీ. చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక దాడిలో మహ్మద్ ఇస్మాయిల్, షేక్ అబ్దుల్ జలీల్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభ్యమైన 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులను చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. నగరంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని ఎస్‌టీఎఫ్ అధికారులు విజ్ఞప్తి చేశారు.






