మిషన్‌ శక్తిశాట్‌కు ఎంపికైన టెన్త్ స్టూడెంట్ : అభినందించిన పవన్ కల్యాణ్

by Naga Rani Yarlagadda |

పేదరికం విద్యార్థుల ప్రతిభకు ఏనాడూ అడ్డుకాదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మరోసారి నిరూపించింది.

మిషన్‌ శక్తిశాట్‌కు ఎంపికైన టెన్త్ స్టూడెంట్ : అభినందించిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: పేదరికం విద్యార్థుల ప్రతిభకు ఏనాడూ అడ్డుకాదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మరోసారి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఆల్-గర్ల్స్ గ్లోబల్ మూన్ మిషన్ ‘మిషన్ శక్తిశాట్’ (Mission ShakthiSAT) కు ఎంపికై ఏపీకి చెందిన కందుల జెస్సీ చరిత్ర సృష్టించింది. 108 దేశాల నుంచి సుమారు 12,000 మంది బాలికలు పోటీ పడగా.. భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో స్థానం పొందిన ఏకైక తెలుగు విద్యార్థినిగా జెస్సీ నిలిచింది. ఈ అద్భుత ఘనత సాధించిన కందుల జెస్సీని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని జెస్సీ పట్టుదలను, కృషిని ఆయన కొనియాడారు. "ప్రభుత్వ పాఠశాల తరగతి గది నుండి చంద్రుని యాత్ర అంచు వరకు సాగిన నీ ప్రయాణం అద్భుతం" అని కితాబు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష ప్రాజెక్టుకు ఎంపిక కావడం రాష్ట్రానికే గర్వకారణమని, ఎందరో విద్యార్థులకు జెస్సీ స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు.

Next Story