చామల VS కొమ్మూరి : కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతం..!

by Batti.Sumithra |

సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

చామల VS కొమ్మూరి : కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతం..!
X

దిశ, మద్దూరు : సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సమావేశానికి హాజరైన ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా భారీకేకులు తీసుకురావడంతో కార్యక్రమం ప్రారంభం నుంచే ఆధిపత్య పోరు కనిపించింది. కేక్ కటింగ్ విషయంలో మాటామాటా పెరిగి వాగ్వాదంగా మారింది. కొద్దిసేపు ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరి పై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం నాయకులతో చర్చించి ఇరు వర్గాల సమక్షంలో ఒకే చోట కేక్ కట్ చేయించి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనతో జన్మదిన వేడుకల్లో రాజకీయ వర్గపోరు బహిర్గతమై చర్చనీయాంశంగా మారింది. పోలీసుల అప్రమత్తతతో పరిస్థితి అదుపులోకి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

Next Story