- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.
నీట్ పరీక్షల లీకేజీ, నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దాడ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.

దిశ, కోదాడ : నీట్ పరీక్షల లీకేజీ, నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, పోరాడుతున్న విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని కోదాడ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. బీఆర్‌ఎస్‌వీ కోదాడ పట్టణ అధ్యక్షుడు బొర్రా వంశీ నాని ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివిన చదువుకు విలువ లేకుండా చేస్తూ, వారి భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల ఉసురు పోసుకుంటే ఎంతటి ప్రభుత్వాలైనా కుప్పకూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, న్యాయం కోసం నిరసిస్తున్న విద్యార్థులపై మోపిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు, సీపీఎం రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోటగిరి వెంకటనారాయణ, ఎంఎల్ పార్టీ నాయకుడు ఉదయగిరి, కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మునీర్, వికలాంగుల సంఘం అధ్యక్షుడు గిద్దె రాజేష్, పీడీఎస్‌యూ నాయకుడు రవి, బీఆర్‌ఎస్ నాయకులు బత్తుల ఉపేందర్, సంపేట ఉపేందర్, ఖరీమ్, మీరా, ఆసిఫ్, మణికంఠ, సతీష్, నవీన్, చలిగంటి వెంకట్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






