- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోండి : సల్మాన్ ఖాన్ యూటర్న్
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పేపర్ లీకేజీ అంశం, తదనంతర ఆందోళనలపై బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పేపర్ లీకేజీ అంశం, తదనంతర ఆందోళనలపై బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి స్పందించారు. తొలుత విద్యార్థుల నిరసనలకు సపోర్ట్ చేసిన సల్మాన్.. ఇప్పుడు ఇళ్లకు వెళ్లిపోండంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి భద్రతే ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్న ఆయన, ఆందోళనలు విరమించి ఇళ్లకు తిరిగి వెళ్లాలని విద్యార్థులకు, నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
"విద్యార్థుల చదువు, వారి రక్షణే అత్యంత ముఖ్యం. కాబట్టి విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ అంశంపై గౌరవనీయులైన ప్రధానమంత్రి ఇప్పటికే స్పందిస్తూ ట్వీట్ చేశారు. లీకేజీకి బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే విద్యార్థులంతా దయచేసి తమ ఇళ్లకు, తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలి" అని కోరారు.
అలాగే నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ కు ఆయన స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. "సోనమ్, ఇక చాలు బ్రో, దీన్ని ఇంతటితో ముగించు. ఒకవేళ భవిష్యత్తులో అవసరమైతే (నాకైతే మళ్లీ ఆ అవసరం వస్తుందని అనిపించట్లేదు) ఈ పోరాట స్ఫూర్తిని మరో రోజు కోసం దాచిపెట్టుకో. ముందు ఏదైనా తిను.. నీకు కావాలంటే మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను" అంటూ తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






