- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఉద్యోగిపై యాజమాన్యం వేధింపుల ఆరోపణలు
దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లిలో ఉన్న టెక్ మహీంద్రా సంస్థ ఎదుట మహిళా ఉద్యోగిని గురువారం నిరసన చేపట్టారు.

దిశ, దుండిగల్ : దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లిలో ఉన్న టెక్ మహీంద్రా సంస్థ ఎదుట మహిళా ఉద్యోగిని గురువారం నిరసన చేపట్టారు. యాజమాన్యం తనను వేధించడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ సంస్థ గేటు ఎదుట ధర్నాకు దిగారు. సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న భావన మాట్లాడుతూ.. తన కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో సిక్ లీవ్ తీసుకున్నానని తెలిపారు. అయితే తాను ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ యాజమాన్యం దానిని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈమెయిల్‌ల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారని, అనంతరం ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టెక్ మహీంద్రా యాజమాన్యంపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు భావన తెలిపారు.






