ముఠాపురం ప్రభుత్వ స్కూళ్లలో ప్రోటీన్ డే

by Taduka Kalyani |   (  Updated:2026-07-23 13:28:43  IST  )

ప్రతి ఇంటికీ ప్రోటీన్, ప్రతి రోజు ప్రోటీన్ తో పాటు ప్రతి చిన్నారికి ప్రోటీన్ అందించాలనే నినాదంతో స్నిగ్ద పౌల్ట్రీ యాజమాన్యం ముఠాపురం గ్రామంలోని ప్రభుత్వ స్కూళ్లలో వినూత్న కార్యక్రమం భారత్ ప్రోటీన్ మిషన్ నిర్వహించారు.

ముఠాపురం ప్రభుత్వ స్కూళ్లలో ప్రోటీన్ డే
X

దిశ, నేలకొండపల్లి: ప్రతి ఇంటికీ ప్రోటీన్, ప్రతి రోజూ ప్రోటీన్, ప్రతి చిన్నారికి ప్రోటీన్ అందించాలనే లక్ష్యంతో స్నిగ్ధ పౌల్ట్రీ యాజమాన్యం ముఠాపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో భారత్ ప్రోటీన్ మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు చికెన్ వంటకాలను అందించారు. చిన్నారుల పెరుగుదలలో ప్రోటీన్ పాత్ర ఎంతో కీలకమని, శారీరక దారుఢ్యం, మానసిక వికాసం కోసం సమతుల్య ఆహారం తప్పనిసరిగా ఉండాలని స్నిగ్ధ పౌల్ట్రీ నిర్వాహకులు డాక్టర్ భాగం కిషన్‌రావు తెలిపారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం సహజ ప్రోటీన్‌లతో కూడిన ఆహారాన్ని అందించే విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏలూరి రామారావు, డాక్టర్ విజయదుర్గ, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

Next Story