- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల ఆత్మహత్యలపై చలించిపోయిన నోరా ఫతేహి.. కాక్రోచ్ పోరాటానికి బాలీవుడ్ మద్దతు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్’ పేపర్ లీక్ కుంభకోణం, తర్వాత పరిణామాలపై ప్రముఖ నటి నోరా ఫతేహి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్’ (NEET) పేపర్ లీక్ కుంభకోణం, తర్వాత పరిణామాలపై ప్రముఖ నటి నోరా ఫతేహి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు తనను ఎంతగానో కలచివేశాయని చెబుతూ, వారి పోరాట పటిమను ఆమె ప్రశంసించారు. ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘ఛలో సంసద్’ మార్చ్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన నేపథ్యంలో, ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా విద్యార్థులకు అండగా నిలుస్తూ ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ఆ ప్రాణాలు వెలకట్టలేనివి
‘బాధలో ఉన్న ప్రతి విద్యార్థికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక మద్దతు ఉంటుంది. విద్య అంటే కేవలం మార్కులు కాదు.. అదొక ఆశ, ఒక స్వప్నం. పేపర్ లీక్ వార్తలు యువతను తీవ్ర నిరాశకు గురి చేశాయి. విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు నన్ను కుదిపేశాయి. ఏ పరీక్ష లేదా ఏ వ్యవస్థ కూడా ఒక యువ ప్రాణాన్ని బలిగొనేలా ఉండకూడదు. పిల్లల్ని కోల్పోయిన కుటుంబాల బాధ వర్ణనాతీతం’ అని నోరా ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ధైర్యానికి సెల్యూట్
భారతీయ విద్యార్థుల ధైర్యం, పట్టుదల చూసి తాను ఆశ్చర్యపోయానని, తన ప్లాట్‌ఫారమ్ ద్వారా వారికి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు ఆమె క్యాప్షన్‌లో పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత కోసం ప్రార్థిస్తున్నానని, ఈ సమస్యకు త్వరలో సరైన పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బాలీవుడ్ నుంచి పెరుగుతున్న మద్దతు
కాగా, నోరాతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా విద్యార్థుల ఆందోళనలకు బాసటగా నిలుస్తున్నారు. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ లాంటి వారు నేరుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొనగా.. సల్మాన్ ఖాన్, అలియా భట్, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ ఖాన్, రాజ్‌కుమార్ రావు తదితరులు సోషల్ మీడియా వేదికగా తమ సంఘీభావం తెలిపారు.
ఏమిటీ ఆందోళనలు?
కాగా, నిరుద్యోగ యువతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ‘బొద్దింకలు’ (cockroaches) అని అన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆవిర్భవించింది. ఆ పదాన్నే ఒక నిరసన ప్రతీకగా మార్చుకుని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. విద్యాశాఖలో సంస్కరణలు, అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.. అని వారి ప్రధాన డిమాండ్లు. జూలై 20న ఢిల్లీలో వీరు తలపెట్టిన ‘ఛలో సంసద్’ మార్చ్ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించారు. అయినా సరే, పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళన జరిగే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు.






