IND VS ZIM: శ్రేయ‌స్ కు బిగ్ రిలీఫ్‌...ఎట్ట‌కేల‌కు తొలి విజ‌యం

by velandi.Saikiran |   (  Updated:2026-07-23 14:24:41  IST  )

జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టు విజయం సాధించింది.

IND VS ZIM: శ్రేయ‌స్ కు బిగ్ రిలీఫ్‌...ఎట్ట‌కేల‌కు తొలి విజ‌యం
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. తన కెప్టెన్సీలో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు అయ్యర్. హరారే వేదికగా భారత్, జింబాబ్వే వేదికగా గురువారం మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి 125 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది భారత్. 13.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసి... సిరీస్ లో లీడ్ లోకి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ 50 పరుగులు చేయగా... ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించారు. చివరలో కెప్టెన్ శ్రేయస్ 28 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. దీంతో జింబాబ్వే పై ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది భారత్. ఈ విజ‌యంతో భార‌త్ 1-0 లీడ్ సంపాదించింది. ఇక భారత్, జింబాబ్వే జట్ల మ‌ధ్య మ‌రో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.

Next Story