- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రచారం పీక్స్ ... ఇన్వెస్ట్‌మెంట్ వీక్..!
రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం వాస్తవ దూరమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు...

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం వాస్తవ దూరమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పీక్స్ లో ఉందని, రాష్ట్రానికి ఇన్వెస్ట్ మెంట్స్ రావడం మాత్రం వీక్‌గా ఉందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్రంలో 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశామని సీఎం చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ డీపీఐఐటీ సమాచారం ప్రకారం కనిపిస్తున్న ఉద్యోగాల సంఖ్య 22 వేలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచారం ఒకటి చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మరో లెక్క చెబుతోంది. ప్రజలు ఎవరి లెక్కలను నమ్మాలి? పబ్లిసిటీ కోసం కాకి లెక్కలు చెప్పడం కాదు.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి.’’ అని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్రంలో భారీ పరిశ్రమలు మాత్రమే కాదు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకుంటేనే పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది. కానీ ఈ రెండేళ్లలో దాదాపు 4,500 చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని లోక్‌సభలో ఇచ్చిన సమాచారమే చెబుతోంది. వాటి కారణంగా దాదాపు 49 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒకవైపు కొత్తగా 22 వేల ఉద్యోగాలు వస్తాయని కేంద్రం చెబుతుంటే.. మరోవైపు దాదాపు 49 వేల ఉద్యోగాలు పోయాయి. ఇదేనా చంద్రబాబు చెప్పే సంపద సృష్టి?’’ అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.






