- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈదులకుంట చెరువులో పడి వ్యక్తి గల్లంతు
by Ratna Kumari |
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులకుంట చెరువులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి పడి గల్లంతైన ఘటన గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, జవహర్‌నగర్: జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులకుంట చెరువులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి పడి గల్లంతైన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దమ్మాయిగూడ పరిధిలోని ఆర్‌జీకే కాలనీకి చెందిన శివ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం స్నేహితుడితో కలిసి ఈదులకుంట చెరువు వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు నీటిలో దిగగా, చెరువు లోతు తెలియక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ సైదులు తెలిపారు.
Next Story






