ప్రైవేట్ లాడ్జ్‌లపై పోలీసుల నిఘా

by Ratna Kumari |

జగిత్యాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు ప్రైవేట్ లాడ్జ్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ప్రైవేట్ లాడ్జ్‌లపై పోలీసుల నిఘా
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు ప్రైవేట్ లాడ్జ్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ పట్టణంలోని పలు లాడ్జ్‌లను తనిఖీ చేసి నిర్వాహకులకు భద్రతా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ.. లాడ్జ్‌లో బస చేసే ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించి, పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాతే గదులు కేటాయించాలని ఆదేశించారు. గుర్తింపు పత్రాలు లేని వారు లేదా అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు ఇవ్వవద్దని, అలాంటి వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే లాడ్జ్‌ల ప్రవేశ ద్వారాలు, రిసెప్షన్, కారిడార్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని చెప్పారు. లాడ్జ్‌లలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు లేదా మాదకద్రవ్యాల వినియోగానికి అవకాశం కల్పిస్తే సంబంధిత నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story