రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

by Taduka Kalyani |

ద్విచక్ర వాహనం అదుపుతప్పి, యువకుడు ఒకరు దుర్మరణం పాలైన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో 44వ హైవేపై గురువారం రాత్రి చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
X

దిశ, భిక్కనూరు : ద్విచక్ర వాహనం అదుపుతప్పి, యువకుడు ఒకరు దుర్మరణం పాలైన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో 44వ హైవేపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి కి చెందిన సభావత్ శివ (31) అనే యువకుడు బైక్ పై హైదరాబాద్ వెళుతున్నాడు. ప్రమాదవశాత్తు టోల్ ప్లాజా దాటగానే అకస్మాత్తుగా వాహనం అదుపుతప్పి కింద పడి చనిపోయాడు. మృతి చెందిన యువకుడు హైదరాబాదులోని మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఈ మేరకు భిక్కనూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.

Next Story