- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్వీ నిరసనకు పోలీసుల అనుమతి
ఢిల్లీలో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ, వారికి సంఘీభావం తెలిపేందుకు భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నిర్వహించనున్న ధర్నాకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ, వారికి సంఘీభావం తెలిపేందుకు భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నిర్వహించనున్న ధర్నాకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె.మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ధర్నాలో గరిష్టంగా 1,000 మంది మాత్రమే పాల్గొనాలని అనుమతిలో పేర్కొన్నారు. కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని.. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని.. డ్రోన్లు, స్కై లాంతర్లు, బాణాసంచా వినియోగించరాదని షరతులు విధించారు. చట్టవిరుద్ధ సంఘటనలు చోటుచేసుకున్నా లేదా నిబంధనలు ఉల్లంఘించినా అనుమతి వెంటనే రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా.. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.






