- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీ
సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం ప్రారంభించారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా కొత్తగూడెంకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు జిల్లా కలెక్టర్ అంకిత్ పూల మొక్క అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి జియో సైన్స్ లేబరేటరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం లేబరేటరీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్ర పరికరాలు, ఖనిజాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. లేబరేటరీలో అందుబాటులో ఉన్న పరీక్షా విధానాలు, విశ్లేషణ సామర్థ్యం, పరిశోధనల ప్రాముఖ్యతపై సింగరేణి అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ జియో సైన్స్ లేబరేటరీ ద్వారా ఖనిజాల నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత వేగవంతంగా, కచ్చితత్వంతో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో సింగరేణి సంస్థలో శాస్త్రీయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు ఆధునిక గనుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సేవలు మరింత మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, సింగరేణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సింగరేణి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






