- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్లలో పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
వాహనాలకు నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా రహదారులపైకి రావొద్దని చర్ల సీఐ రాజు వర్మ స్పష్టం చేశారు.

దిశ చర్ల,: వాహనాలకు నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా రహదారులపైకి రావొద్దని చర్ల సీఐ రాజు వర్మ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గురువారం చర్ల మండల ప్రధాన కూడలిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. సీఐ రాజు వర్మ, ఎస్సై నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రధాన కూడలిలో వాహనాలను ఆపి నంబర్ ప్లేట్లు, ఇతర నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి, నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐ రాజు వర్మ మాట్లాడుతూ.. వాహనానికి స్పష్టంగా కనిపించే విధంగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం ప్రతి వాహన యజమాని బాధ్యత అని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలతో పాటు చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల ప్రాణ రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇకపై కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు నర్సిరెడ్డి, కేశవ్ లు మరియి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






