- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
మోత్కూరులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

దిశ, మోత్కూరు: మోత్కూరులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక సాయిబాబా ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ నిర్వహించి భక్తులు, నిరుపేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగుతూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని ఆకాంక్షించారు. జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆదర్శనీయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






