- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజాన్ని ప్రేమించిన వ్యక్తి కామ్రేడ్ బొల్లెద్దుల శ్రీనివాస్
దివంగత కామ్రేడ్ బొల్లెద్దుల శ్రీనివాస్ కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, సమాజాన్ని కూడా అంతే ప్రేమించిన వ్యక్తి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల నరసింహ అన్నారు.

దిశ, పెద్దకొత్తపల్లి : సీపీఐ పెద్దకొత్తపల్లి మండల కార్యదర్శి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు దివంగత కామ్రేడ్ బొల్లెద్దుల శ్రీనివాస్ కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, సమాజాన్ని కూడా అంతే ప్రేమించిన వ్యక్తి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల నరసింహ అన్నారు. గురువారం పెద్దకొత్తపల్లి మండలంలోని దేవుని తిరుమలాపురం గ్రామంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ అధ్యక్షతన నిర్వహించిన బొల్లెద్దుల శ్రీనివాస్ సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చిన్న వయసులోనే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై, తన మేనమామ, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు **జి. హుస్సేనయ్య** అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థి, యువజన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న శ్రీనివాస్ అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ పెద్దకొత్తపల్లి మండల కార్యదర్శిగా, జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా ఎదిగారని కొనియాడారు. ఈ ప్రాంతంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధన కోసం నిర్వహించిన పాదయాత్రలు, ప్రజా పోరాటాల్లో ఆయన చురుకైన పాత్రను గుర్తు చేశారు. ఇంత చిన్న వయసులో ఆయన మృతి చెందడం కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.
ప్రజలతో మమేకమైన నాయకుడు..
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ మాట్లాడుతూ.. బొల్లెద్దుల శ్రీనివాస్ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా అందరితో ఆప్యాయంగా కలిసిపోయే స్వభావం కలిగిన నాయకుడని చెప్పారు. విద్యార్థి, యువజన ఉద్యమాల సందర్భంగా పంజాబ్, హర్యానా, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న జ్ఞాపకాలను ఆయన స్మరించుకున్నారు. ఈ సంస్మరణ సభలో సీపీఐ సీనియర్ నాయకులు జి.హుస్సేనయ్య, రాష్ట్ర సమితి సభ్యుడు కే. కేశవులు గౌడ్, నాయకులు వి.వెంకటయ్య, టీ.నరసింహ, కే.రామకృష్ణ, కే.యేసయ్య, కేతేపల్లి ఊషన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వి.సత్యం, కాంగ్రెస్ నాయకుడు గోపాలరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ విష్ణు, సీపీఐ జిల్లా, మండల నాయకులు, ప్రజానాట్యమండలి ప్రతినిధులు, కళాకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని బొల్లెద్దుల శ్రీనివాస్‌కు నివాళులర్పించారు.






