' పార్టీ డాటాతో ఓట్ల నమోదు చేపట్టాలి '

by Batti.Sumithra |

పార్టీ ఇచ్చిన డాటాతో ఓట్ల నమోదు ప్రక్రియను నిర్వహించాలని "సర్" జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి ధనలక్ష్మి అన్నారు.

 పార్టీ డాటాతో ఓట్ల నమోదు చేపట్టాలి
X

దిశ, జహీరాబాద్ : పార్టీ ఇచ్చిన డాటాతో ఓట్ల నమోదు ప్రక్రియను నిర్వహించాలని "సర్" జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి ధనలక్ష్మి అన్నారు. ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన "సర్" జహీరాబాద్ మండల సమీక్ష సమావేశానికి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఇన్‌చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్‌తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షుడు ఎం.జీ. రాములు అతిథులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్క బీఎల్‌ఏలు ఇంటింటికి తిరిగి అందరి ఓట్లు నమోదయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఓట్లు కట్ కాకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన రాష్ట్రాల్లో సర్ పట్ల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సర్ కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

ఈ నెల 30వ తేదీలోపు సర్ కార్యాచరణ పూర్తి కావాలని, ఇంకా కనీసం 10 శాతం ఓట్లు నమోదు కావాల్సి ఉందన్నారు. ప్రతి బూత్ స్థాయికి ఫారాలు పంపిస్తామని, వాటిని నిర్లక్ష్యం చేయకుండా నింపి పంపించాలని సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల పేదలు, మైనార్టీల ఓట్ల తొలగింపే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చురుకుగా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తకు రాహుల్ గాంధీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ పొడిగించిన ఎన్రోల్మెంట్ గడువును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కడెం నర్సింలు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అస్మాత్ బస్సు, సర్ నియోజకవర్గ ఇన్‌చార్జి గౌసొద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, కిషన్ రాథోడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్, అర్షద్ పటేల్, అనంతయ్య, కౌన్సిలర్ మహేష్, ముజఫర్, మాజీ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story