- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెర్కిట్‌లో విషాదం.. ఇంట్లో ఉరివేసుకుని యువకుడు మృతి
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెర్కిట్‌కు చెందిన పెద్దకాపు రవీందర్ రెడ్డి (35) గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు.

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెర్కిట్‌కు చెందిన పెద్దకాపు రవీందర్ రెడ్డి (35) గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రవీందర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు కొంతకాలానికి ఒకసారి ఇంటికి తీసుకువచ్చి, తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం రవీందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి పెర్కిట్‌లోని తన ఇంటికి వచ్చాడు. గురువారం కుటుంబ విషయమై తండ్రి పెద్దకాపు చిన్న రాజేశ్వర్‌తో మాట్లాడిన అనంతరం, అతని తల్లిదండ్రులు కోడలు, మనవరాలిని ఇంటికి తీసుకురావడానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి రవీందర్ రెడ్డి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మృతుడు రవీందర్ రెడ్డికి భార్య, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో పెర్కిట్ ప్రాంతంలో విషాదం నెలకొంది.






