- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ సెక్స్ అంటే తెలుసా?
నా వయసు 40 సంవత్సరాలు. మా వారి వయసు 42. మాకు ఒక పాప, బాబు. నేను స్కూల్లో టీచర్‌గా పని చేస్తాను. మా వారు ఊరికే పాలిటిక్స్ అని తిరుగుతుంటారు. సంపాదన లేదు.

దిశ, ఫీచర్స్ : నా వయసు 40 సంవత్సరాలు. మా వారి వయసు 42. మాకు ఒక పాప, బాబు. నేను స్కూల్లో టీచర్‌గా పని చేస్తాను. మా వారు ఊరికే పాలిటిక్స్ అని తిరుగుతుంటారు. సంపాదన లేదు. నేను గత కొన్ని సంవత్సరాలుగా మా వారి వల్ల చాలా బాధకు, అవమానానికి లోనవుతున్నా. చనిపోవాలనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతుకుతున్నా. మా వారు తనకు పరిచయం ఉన్న స్త్రీలతో ఫోన్‌లో గంటల కొద్ది మాట్లాడుతుంటారు. మాట్లాడటమే కాదు.. ఆ సమయంలో హస్త ప్రయోగం చేస్తుంటారు. అతని అలవాటుతో నాకు జీవితం మీద విరక్తి వచ్చేసింది. హస్త ప్రయోగమే కాదు.. బెడ్‌పై వాళ్ల పేర్లు కూడా కలవరిస్తాడు. చాలాసార్లు విపరీతంగా గొడవైంది. రెండు కండోమ్‌లు వాడుతున్నా. అలా ఫోన్ సెక్స్ చేయకపోతే పిచ్చెక్కుతుందంటున్నాడు. చాలాసార్లు విడాకుల గురించి కూడా ఆలోచించా.. నా పిల్లలే గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకున్నా. ఈయనకి ఇదేమి వ్యసనం మేడం? సెల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేడు. దీనికి చికిత్స ఉందా? నా జీవితం మీ జవాబు మీదే ఆధారపడి ఉంది. - వి.ఎస్, నెల్లూరు
జవాబు : ఆన్‌లైన్, బిల్ బోర్డ్స్ పైన, టీవీలో, స్కూల్స్‌లో, బుక్స్‌లో, ఫోన్స్‌లో, పత్రికల్లో, మీడియాలోని చాలా శాఖల్లో ప్రతిచోటా ప్రపంచమంతా సెక్స్, దానికి సంబంధించిన సమాచారం ఉంది. అంతేకాదు మనుషుల్లో కూడా సెక్స్ పట్ల తవ్రమైన ఇష్టం, తనను తాను నిగ్రహించుకోలేని బలహీనత, వ్యసనం రోజురోజుకు తీవ్రమవుతుంది. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం.. మనుషుల్లో మితిమీరిన శృంగార వాంఛ ఒక వదిలించుకోలేని బలహీనత, వ్యసనంగా మారుతుంది. సెక్స్, దానికి సంబంధించిన ఆలోచన, దాని చుట్టూ అల్లుకునే చర్యలు, వీటిలో పాలు పంచుకోవాలన్న తీవ్రమైన ఆసక్తి, అలవాటు చివరకు భార్యాభర్తల మధ్య బంధాన్ని బలహీనపరుస్తుంది. పని చేసే స్థలాల్లో సమస్యలను సృష్టించడమే కాదు సమాజంలో సరిగా కలవలేక పోతారు. వీరిలో బాంధవ్యాలు, ప్రేమలు ఉండవు. కోరిక తీర్చుకోవడమే లక్ష్యంగా సంబంధాలను మారుస్తుంటారు. అందుకే వీళ్లలో ఎక్కువగా ఆన్ లైన్‌లో పోర్నోగ్రఫీకో లేదా ఫోన్ సెక్స్‌తో తృప్తి పడుతుంటారు. సెక్స్ అడిక్షన్ కారణంగా వాళ్ల ప్రవర్తన మీద అదుపు ఉండదు.
ఫోన్ సెక్స్ అడిక్షన్‌కు చికిత్స
కాగ్నిటివ్ థెరపీ, బిఎంటి, ఎవర్షన్ థెరపీ, కౌన్సిలింగ్ ద్వారా ఈ రకమైన మనో లైంగిక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ సమస్య ఉన్న వారు సెక్సాలజిస్ట్‌ను వెంటనే సంప్రదించాలి. బాధితులు సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు కంప్లయింట్ చేస్తే తీవ్రమైన జైలు శిక్ష పడుతుంది.






