- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకులాల్లో కార్పొరేట్ విద్యా ప్రమాణాలు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్య, వసతులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్య, వసతులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పోషకాహారంలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణమే ప్రభుత్వ ప్రాధాన్యమని, వారి అభ్యున్నతికి అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతోందని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ నగరం సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌ను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధన, భోజనం, వసతి, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కొత్తగా చేరిన విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కూడిన వెల్‌కమ్ కిట్లను పంపిణీ చేశారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన ఏ విషయంలోనూ ప్రభుత్వం రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. గురుకుల విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ, సివిల్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తూ తెలంగాణకు గుర్తింపు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో విక్టోరియా మెమోరియల్ విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి విజయేంద్ర బోయి, విక్టోరియా మెమోరియల్ విద్యాసంస్థల కార్యదర్శి సల్మాబాను, ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






