18 బంతుల్లో వైభవ్ అర్థ సెంచరీ.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్ గా రికార్డ్

by velandi.Saikiran |   (  Updated:2026-07-23 14:04:49  IST  )

జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ ఊచకోత కోశాడు

18 బంతుల్లో వైభవ్ అర్థ సెంచరీ.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్ గా రికార్డ్
X

దిశ‌, వెబ్ డెస్క్: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ ఊచకోత కోశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 50 పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ 50 ప‌రుగుల్లో 4 సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉన్నాయి.

అయితే అర్థ సెంచరీ చేసిన తర్వాత రిచర్డ్ బౌలింగ్ లో బెన్ కర్రన్ కు క్యాచ్ ఇచ్చి వైభవ్ ఔట్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒకే ఒక్క పరుగు చేసి విఫలమయ్యాడు. జింబాబ్వే విధించిన 125 పరుగులను ఛేదించే క్రమంలో ఇప్పటికే వంద పరుగులు క్రాస్ చేసింది భారత్. ప్రస్తుతం ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Next Story