PD చట్టం కింద ఇద్దరు నేరస్థులపై నిర్బంధ ఉత్తర్వులు

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా చెన్నూరు మండలానికి చెందిన షేక్ జహీరుద్దీన్ అలియాస్ అబ్బాస్ (30), తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలానికి చెందిన తొండ శాంతి అలియాస్ కాసమ్మ (36)పై పి.డి. (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి..

PD చట్టం కింద ఇద్దరు నేరస్థులపై నిర్బంధ ఉత్తర్వులు
X

దిశ, కడప టౌన్: కడప జిల్లా చెన్నూరు మండలానికి చెందిన షేక్ జహీరుద్దీన్ అలియాస్ అబ్బాస్ (30), తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలానికి చెందిన తొండ శాంతి అలియాస్ కాసమ్మ (36)పై పి.డి. (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. షేక్ జహీరుద్దీన్‌పై ప్రభుత్వ విధులకు ఆటంకం కల్పించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేయడం తదితర ఆరోపణలతో కడప జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

తొండ శాంతిపై వరుస దొంగతనాలు, ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడిన కేసులు కడపతో పాటు ఇతర జిల్లాల్లో కలిపి 38 నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జూలై 22న పి.డి. చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వారిని సెంట్రల్ జైలుకు తరలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పి.డి. చట్టం, జిల్లా బహిష్కరణ వంటి కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు. అలాగే కేసుల దర్యాప్తు చేసి పి.డి. చట్టం అమలుకు కృషి చేసిన పోలీసు అధికారులను అభినందించారు.

Next Story