ఆవరణ చుట్టూ మొక్కలు నాటించాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్

by Batti.Sumithra |

చిన్నశంకరంపేట మండల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సీ) బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆవరణ చుట్టూ మొక్కలు నాటించాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
X

దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సీ) బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటగది, స్టోర్‌రూమ్‌ను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణ, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్లు, ఇతర వసతులను పరిశీలించారు. హాస్టల్‌లోని విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలను వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా హాస్టల్‌లో ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని, మరుగుదొడ్లు, హాస్టల్ గదుల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆవరణలో మొక్కలను క్రమపద్ధతిలో నాటి, వాటిని సంరక్షించాలని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ నిధులను వినియోగించి హాస్టల్‌లో అవసరమైన సౌకర్యాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహంలో సరిపడా వెలుతురు ఉండేలా అదనంగా ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే బయటి వ్యక్తులను హాస్టల్‌లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ తులసీరామ్, ఎంపీడీవో దామోదర్, సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story