- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీడీవో కార్యాలయంలో నూతన సర్పంచులకు గుర్తింపు ఎక్కడ..?
మండల పరిధిలోని 26 పంచాయతీల్లో నూతన సర్పంచులు కొలువుతీరారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తోంది..!

దిశ, చర్ల: మండల పరిధిలోని 26 పంచాయతీల్లో నూతన సర్పంచులు కొలువుతీరారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తోంది..! అయితే నేటికీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంపై పాత సర్పంచ్ ల పేర్లు దర్శనం ఇస్తున్నాయి. ఈ దృశ్యాలు గురువారం ‘దిశ’ కెమెరాకు చిక్కాయి. ప్రతిరోజు వందల మంది వచ్చి పోయే ప్రజలు కార్యాలయం గోడలపై పాత సర్పంచ్ ల పేర్లు చూసి ఖంగు తింటున్నారు. ప్రజలను గెలిచిన అధికారులను గెలవలేదు అంటు చర్చించుకుంటున్నారు. ఇక నూతన సర్పంచులు సైతం ఈ దృశ్యాలు చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను గెలిచి సర్పంచ్ పీఠం ఎక్కినప్పటికీ అధికారులను మాత్రం గెలవలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్పంచులు కొలువు తీరి ఏడాది దగ్గర పడుతున్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో పాత సర్పంచ్ ల పేర్లు కొనసాగించడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి పాత సర్పంచ్ ల పేర్లను తొలగించి కొత్తగా కొలువుదీరిన సర్పంచ్ ల పేర్లను నమోదు చేయాలని కోరుతున్నారు.






