- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామన్వెల్త్ గేమ్స్ 2026 : తొలిరోజే భారత్‌కు పతకం ఖాయం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు తొలిపతకం ఖాయమయింది. స్కాట్లాండ్ లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభమవ్వగా.. తొలిరోజే భారత్ కు పతకం ఖాయమవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు తొలిపతకం ఖాయమయింది. స్కాట్లాండ్ లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభమవ్వగా.. తొలిరోజే భారత్ కు పతకం ఖాయమవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాక్సింగ్ లో ఉమెన్స్ 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గో హెయిన్ నేరుగా సెమీ ఫైనల్స్ ను అర్హత సాధించింది. దీంతో ఆమె భారత్ కు కాంస్యాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్స్ లో ఐదుగురు బాక్సర్లే ఉండగా.. డ్రా తీశారు. ఇందులో లవ్లీనాకు బై లభించగా.. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా నేరుగా సెమీస్ కు ఎంపికయ్యారు. మిగిలిన ఇద్దరు ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడి సెమీ ఫైనల్ కు ఎంపిక కావలసి ఉంటుంది. జులై 31న జరిగే సెమీఫైనల్ లో తువాలుకు చెందిన టీకేబీపీ తాఫాకీతో.. లవ్లీనా తలపడనుంది. సెమీ ఫైనల్స్ లో లవ్లీనా గెలిస్తే.. సిల్వర్ లేదా గోల్డ్ మెడల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. అస్సాంకు చెందిన లవ్లీనా టోక్సో ఒలింపిక్స్ 2020లో కాంస్యం, 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 75 కేజీల బాక్సింగ్ లో గోల్డ్ మెడల్, 2022 ఏషియన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్, 2023 ఆసియా గేమ్స్ లో సిల్వర్ మెడల్స్ సాధించింది.






