- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జొన్నగిరి గోల్డ్‌మైన్ పేరు మార్చిన ప్రభుత్వం
కర్నూలు జిల్లా తుగ్గలి వద్ద ఉన్న జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును 'స్వర్ణగిరి గోల్డ్ మైన్' గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా తుగ్గలి వద్ద ఉన్న జొన్నగిరి గోల్డ్ మైన్(Jonnagiri Gold Mine) పేరును 'స్వర్ణగిరి గోల్డ్ మైన్'(Swarnagiri Gold Mine) గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం(AP Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. గనుల తవ్వకం రంగంలో స్థానిక సంస్కృతి, పురాతన ప్రాశస్త్యానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 'స్వర్ణ' అనగా బంగారం అనే అర్థం వస్తుండటంతో, బంగారు గనికి మరింత సార్థకత చేకూరేలా ఈ నూతన నామకరణం చేసింది.
జియో మైసూర్ సర్వీసెస్ ఇండియాకు ఆదేశాలు
అలాగే ఈ గనిని నిర్వహిస్తున్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా (Deccan Gold Mines / Geo Mysore Services India) సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అన్ని రకాల లావాదేవీలు, ప్రాజెక్టు పత్రాల్లో కొత్త పేరునే ఉపయోగించాలని సూచించింది. ప్రభుత్వ రికార్డుల్లో, అలాగే కంపెనీ అంతర్గత, బాహ్య వ్యవహారాల్లో తక్షణమే 'స్వర్ణగిరి గోల్డ్ మైన్'గా పేరును సవరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.






