- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ నివాసంలో ఇండి కూటమి అత్యవసర సమావేశం.. వ్యూహంపై కీలక చర్చలు
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా (INDIA) కూటమి అగ్రనేతలు, ఎంపీలు అత్యవసరంగా భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా (INDIA) కూటమి అగ్రనేతలు, ఎంపీలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రియాంకగాంధీ సహా కాంగ్రెస్, లెఫ్ట్, ఆర్జేడీ, టీఎంసీ ఎంపీలు హాజరయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, సీజేపీ నిరసనలు, పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, విపక్షాల ఐక్యతను చాటేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఉభయ సభల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై ఎంపీలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేస్తున్నారు. సమావేశం అనంతరం ఇండి కూటమి నేతలంతా కలిసి మహాత్మా గాంధీ స్మారక స్థలి అయిన 'రాజ్ ఘాట్' ను సందర్శించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తమ నిరసనను శాంతియుతంగా తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం వెలుపల నేతల కోసం ముందస్తుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రాహుల్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భేటీ పూర్తయిన వెంటనే కూటమి నేతలు ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






