సమ్మె విరమించిన డాక్టుమెంట్ రైటర్లు.. రేపటి నుంచి ఆన్ డ్యూటీ

by Naga Rani Yarlagadda |

ఏపీలో పెన్ డౌన్ ప్రకటించిన డాక్యుమెంట్ రైటర్లు.. తమ సమ్మెను విరమించారు.

సమ్మె విరమించిన డాక్టుమెంట్ రైటర్లు.. రేపటి నుంచి ఆన్ డ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పెన్ డౌన్ ప్రకటించిన డాక్యుమెంట్ రైటర్లు.. తమ సమ్మెను విరమించారు. ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్ల సంఘం సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐటీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్.. డాక్యుమెంట్ రైటర్ల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారు అడిగిన సందేహాలను ఆయన కూల్ గా నివృత్తి చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK) స్థాపన, వాటి ఉద్దేశం, నిర్వహణ, సేవలను ఐజీ అంబేద్కర్ వివరించారు. ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలను అందించేందుకే RSKలను స్థాపిస్తున్నట్లు తెలిపారు. వీటివల్ల దస్తావేజు లేఖర్ల వృత్తి హక్కులకు, అవకాశాలకు భంగం కలిగించవని ఆయన స్పష్టం చేశారు. ఐజీ వివరణతో సంతృప్తి చెందిన డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ .. సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

Next Story