- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
మండలంలోని ముచ్చినిపర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ చేసిన 6 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దిశ, చిట్యాల : మండలంలోని ముచ్చినిపర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ చేసిన 6 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు జిల్లా సీసీఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీశెట్టి సత్యనారాయణ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు సంబంధిత వ్యక్తిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం చిట్యాల పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందించాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






