కేంద్రం ఆఫర్‌ను తోసిపుచ్చిన CJP.. రేపు దేశవ్యాప్త ఆందోళనలు

by Gantepaka Srikanth |

పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పష్టం చేసింది.

కేంద్రం ఆఫర్‌ను తోసిపుచ్చిన CJP.. రేపు దేశవ్యాప్త ఆందోళనలు
X

దిశ, వెబ్‌డెస్క్: పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు, ప్రయోజనాల కోసం జులై 24న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు (Nationwide Protest) పిలుపునిచ్చింది. పేపర్ లీకేజీల నియంత్రణకు, భవిష్యత్తులో ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నప్పటికీ CJP నాయకులు, విద్యార్థి ప్రతినిధులు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు, హామీలు కేవలం కాలయాపనకే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

వీధుల్లోకి విద్యార్థులు, యువత..

జులై 24న నిర్వహించ తలపెట్టిన ఈ ఆందోళనలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించేందుకు CJP ప్రణాళికలు సిద్ధం చేసింది. పేపర్ లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్చలకు పిలుపునిస్తున్నా, మరోవైపు నిరసనలు ఉధృతం కానుండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story