- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 28న వైసీపీ నిరసన ప్రదర్శనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల సాధనకు ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది..

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల సాధనకు ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో, ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకుంటున్న వైఫల్యాలపై నిరసిసన వ్యక్తం చేయనుంది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నిరసనలను పటిష్టంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా కేంద్రంలోనూ పెద్ద ఎత్తున కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. డీఎస్సీ (DSC) నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసించడంతో పాటు, నీట్ (NEET) పరీక్షలో చోటుచేసుకున్న పొరపాట్లపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేయనుంది. అలాగే నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ఈ నిరసనలు చేపట్టనున్నారు.






