ఆ గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా

by Batti.Sumithra |

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఆ గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా
X

దిశ, వర్గల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మహిళల విజ్ఞప్తితో నిర్వహించిన సమావేశంలో గ్రామస్థులంతా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించినా లేదా నిషేధాన్ని ఉల్లంఘించినా రూ.5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించారు. మద్యపానం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో పాటు యువత చెడు అలవాట్ల బారిన పడుతున్న నేపథ్యంలో గ్రామ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిటుకుల విజయలక్ష్మి, ఉపసర్పంచ్ హేమలత జ్ఞానేశ్వర్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ చిటుకుల విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story