- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. కాళేశ్వరం, గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‍తో (CR Patil) భేటీ అయింది. గురువారం సీఆర్ పాటిల్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడెం నగేశ్, డీకే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, కాళేశ్వరం, తదితర అంశాలపై చర్చించారు. ఎల్‍నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం అంతా కాళేశ్వరం బ్యారేజీల చుట్టూ తిరుగుతున్న తరుణంలో బీజేపీ ఎంపీలు కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
సమ్మక్క సాగర్ నుంచి గోదావరి కావేరి అనుసంధానం:
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ చెప్పిందని, ఆ ఆదేశాల మేరకు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి నది జలాలను ఎత్తి పోసే ప్రసక్తే లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఒక వేళ కన్నెపల్లి పంపులు ప్రారంభించాలంటే బీజేపీ నేతలు ఎన్డీఎస్ఏ అనుమతులు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరో వైపు సమ్మక్క సాగర్ నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో ఆసక్తిగా మారింది.
త్వరలో మరోసారి ముగ్గురు సీఎంల భేటీ?:
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. గోదావరి-కావేరి అనుసంధానం, బనకచర్ల, పాలమూరు ప్రాజెక్టులపై చర్చించేందుకు త్వరలో భాగస్వామ్య రాష్ట్రాలతో భేటీ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే తుంగభద్ర రిజర్వాయర్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఒకే వేదికపై కలిశారు. అయితే త్వరలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.






