- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ ధనరాజ్
అంటువ్యాధులు, కీటక జనిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. ధనరాజ్ సూచించారు.

దిశ, మిరుదొడ్డి : అంటువ్యాధులు, కీటక జనిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. ధనరాజ్ సూచించారు. గురువారం మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల నిల్వ, రోగులకు అందుతున్న సేవలపట్ల అరా తీశారు. వర్షాకాలంలో అధికంగా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలను అప్రమత్తం చెయ్యాలని, వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పారిశుధ్యం అవశ్యకత పై అవగాహన పెంచాలని సూచించారు. రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, టీడీ హబ్ కు రక్త నమూనాలను పంపాలని ఆదేశించారు.
ఇంటింటికి జ్వరం సర్వేను పకడ్బందీగా నిర్వహించడానికి గ్రామసర్పంచ్, కార్యదర్శి, ఆశ వర్కర్ ల సహకారంతో ఈగలు, దోమల వ్యాప్తి చెందకుండా దోమల వ్యాప్తిని లార్వా దశలోనే అరికట్టాలన్నారు. మురుగు నీటి నిల్వలు, నీటి గుంతల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి ధనరాజు సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ల్యాబ్, ఫార్మసీ రికార్డులను పరిశీలించి, చికిత్సలు పొందుతున్న రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్, ఎమ్ఎల్ ఎచ్పి మౌనిక, ఫార్మసీ శ్రీనివాస్, టెక్నిషియన్ రవీందర్, ఎస్ఎన్ కవిత, సిబ్బంది ఉన్నారు.






