- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుర్కయంజాల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు
ఆదిభట్ల సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, తుర్కయంజాల్ : ఆదిభట్ల సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుర్కయంజాల్ డివిజన్‌లో సాగర్ హైవే పై అరుణ కన్వెన్షన్ హాల్ పక్కన అనుమతులకు విరుద్ధంగా భవనం ముందు భాగంలో అదనంగా ఇనుప మెట్ల నిర్మాణం కోసం భారీ స్తంభాలను క్రేన్ సహాయంతో ఏర్పాటు చేస్తూ పనులు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అత్యంత రద్దీగా ఉండే సాగర్ హైవే పై ఈ నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా భవిష్యత్తులో రోడ్డు విస్తరణ చేపట్టాల్సి వస్తే ఈ అదనపు నిర్మాణాలు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆదిభట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ నిర్మాణదారులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే మౌనంగా ఉండటంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాల పై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆదిభట్ల సర్కిల్‌లో మాత్రం అవి కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






