వన మహోత్సవంలో వినూత్న కార్యక్రమం..

by Taduka Kalyani |

చెట్లు నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్సై విక్రం కుమార్ అన్నారు.

వన మహోత్సవంలో వినూత్న కార్యక్రమం..
X

దిశ,కామారెడ్డి రూరల్ : చెట్లు నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్సై విక్రం కుమార్ అన్నారు. కామారెడ్డి మండలం గర్కుల్ గ్రామంలో గురువారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈత చెట్లను నాటిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా స్వచ్ఛమైన గాలితో మానవులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అందుకే ప్రజలంతా విరివిగా చెట్లు నాటాలని కోరారు. ఈత చెట్లు నాటడం వల్ల గౌడ కులస్తులకు పర్యావరణాన్ని పెంపొందించడం తో పాటు, ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గర్గుల్ గ్రామంలో 2000 ఈత చెట్లను నాటినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో ఈత, ఖర్జూర చెట్లు నాటడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దివ్య టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్, సాయ గౌడ్ పెద్ద రాజా గౌడ్,గౌడ సంఘం సభ్యులు, నరసింహులు శరత్ చంద్ర దినేష్ కుమార్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story