- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్తుపల్లి ఏరియా ఆసుపత్రి సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి
సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు.

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో సత్తుపల్లి ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. సురేష్ నారాయణ్ గురువారం కిష్టారం గ్రామంలో ఉప ముఖ్యమంత్రిని కలిసి ఆసుపత్రి పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వైద్యుల కొరత, నర్సింగ్ సిబ్బంది అవసరం, పారిశుధ్య కార్మికుల నియామకం, అత్యవసర వైద్య పరికరాల కొరత వంటి అంశాలను ప్రస్తావించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టడంతో పాటు, మౌలిక వసతుల కల్పన, ఆధునిక వైద్య పరికరాల సమీకరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. సత్తుపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.






