- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం 2.12 గంటలకు సికింద్రాబాద్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ నుంచి అందిన సమాచారం మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు క్రైమ్ నం. 377/2026గా కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. ప్రాథమిక విచారణలో మహిళ అనారోగ్య కారణాలతో సహజ మరణం చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు, తెలుపు వర్ణం, గుండ్రని ముఖం కలిగి ఉంది. ఆమె ఎడమ చేతిపై పుట్టుమచ్చ గుర్తుగా ఉంది. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే లేదా ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే 94400 83160 లేదా 87126 58581 నంబర్లను సంప్రదించాలని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.






