పాన్ షాపులో గంజాయి అమ్మకాలు..

by Batti.Sumithra |

షాపులో గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న పాన్ డబ్బాపై ఎస్టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.

పాన్ షాపులో గంజాయి అమ్మకాలు..
X

దిశ, శేరిలింగంపల్లి : షాపులో గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న పాన్ డబ్బాపై ఎస్టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మాదాపూర్ చంద్ర నాయక్ తండా రోడ్డులోని సోహల్ పాన్ షాప్పై దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 500 గ్రాముల బరువున్న 10 ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. 10 గ్రాముల చొప్పున ఉన్న ప్యాకెట్లను రూ.300కు కొనుగోలు చేసి, రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. పాన్ షాపులో గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న మాలిక్ ఆస్లామ్ టామ్ బోలీ అనే వ్యక్తిని అరెస్టు చేసి, తదుపరి చర్యల కోసం మాదాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

Next Story