వికలాంగుడికి చేయూత.. మానవత్వం చాటుకున్న వెల్డర్

by Ratna Kumari |

ఆపదలో ఉన్న వారికి చేయూత అందించడానికి ఆస్తిపాస్తులు అవసరం లేదని, విశాలమైన మనసు ఉంటే చాలని జగిత్యాలకు చెందిన వెల్డర్ ప్రభాకరాచారి నిరూపించారు.

వికలాంగుడికి చేయూత.. మానవత్వం చాటుకున్న వెల్డర్
X

దిశ, జగిత్యాల టౌన్ : ఆపదలో ఉన్న వారికి చేయూత అందించడానికి ఆస్తిపాస్తులు అవసరం లేదని, విశాలమైన మనసు ఉంటే చాలని జగిత్యాలకు చెందిన వెల్డర్ ప్రభాకరాచారి నిరూపించారు. వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన నగునూరి కనకయ్య ప్రమాదంలో ఒక కాలు కోల్పోయి, నడుము దెబ్బతినడంతో నడవలేని స్థితికి చేరుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని దయనీయ పరిస్థితిని చూసిన మాజీ ఆటోమొబైల్ మెకానిక్ యూనియన్ అధ్యక్షుడు, వెల్డర్ ప్రభాకరాచారి వెంటనే స్పందించారు. పాత బేరింగులు, ట్రాక్టర్ సీటును ఉపయోగించి స్వయంగా ఒక నాలుగు చక్రాల బండిని తయారు చేసి, గురువారం జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ చేతుల మీదుగా కనకయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ.. "సేవ చేయడానికి డబ్బు, హోదా అవసరం లేదు.. స్పందించే మనసు ఉంటే చాలు" అని పేర్కొంటూ ప్రభాకరాచారి మానవత్వాన్ని అభినందించారు. ప్రభాకరాచారి చేసిన ఈ సేవను స్థానికులు ప్రశంసిస్తూ, ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

Next Story