- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్త్రీనిధి రుణ బకాయిల వసూళ్లలో పురోగతి సాధించాం
నాగిరెడ్డిపేట్ మండలంలో పేరుకుపోయిన స్త్రీనిధి రుణాల బకాయిల వసూల్లో పురోగతిని సాధించినట్లు జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు.

దిశ, నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలో పేరుకుపోయిన స్త్రీనిధి రుణాల బకాయిల వసూల్లో పురోగతిని సాధించినట్లు జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటుచేసిన వివోఏల సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జులై నెల ప్రారంభంలో స్త్రీనిధి రుణాలు 1 కోటి 60 లక్షలు ఉండగా,వాటిలో 22లక్షల రూపాయలను బకాయిలు వసూలు చేశామని,గతంతో పోలిస్తే 23.26శాతం వృద్ధి సాధించామని,రుణాల వసూలు కోసం ప్రత్యేక అధికారిగా డిపిఎం శ్రీనివాస్ నియమించామని తెలిపారు.ఇక్కడ పనిచేసిన ముగ్గురు సీసీలు బదిలీ కాగా వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయని,వాటిని పది రోజుల్లో భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.జిల్లాలో 715 గ్రామ సంఘాలు,17030 మహిళా సంఘాలు ఉన్నాయని, 1లక్ష 81,886 మంది సభ్యులు ఉన్నారని, రుణాలను సకాలంలో తీసుకుని, చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.జిల్లాలో ఉన్న 22 మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం బస్సులు అందించిందని,గత మూడు నెలలుగా రూ.69,468 మండల సమాఖ్యకు చెల్లించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి ఆర్ఎం కుమార్,ఇన్చార్జి ఏపిఎం దత్తు,మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బెస్త శాంత, సీసీలు, వివోఏలు సిబ్బందిలు తదితరులు పాల్గొన్నారు.






