మూడు నెలల్లోనే చోరీ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

by Taduka Kalyani |

చోరీ కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, నిందితులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడం పోలీసు వ్యవస్థ సమర్థతకు నిదర్శనం.

మూడు నెలల్లోనే చోరీ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
X

దిశ, కారేపల్లి: చోరీ కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, నిందితులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడం పోలీసు వ్యవస్థ సమర్థతకు నిదర్శనం. కారేపల్లి పోలీసులు ఇదే విషయాన్ని మరోసారి నిరూపించారు.ఏప్రిల్‌లో నమోదైన చోరీ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించి,నిందితుడిని అరెస్ట్ చేసి,చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడమే కాకుండా,కేవలం రెండు నెలల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేసి మూడు నెలల వ్యవధిలోనే కోర్టు నుంచి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధింపజేయడం అభినందనీయమైన విషయం. కారేపల్లి సీఐ సాగర్ పరిరక్షణలో ఎస్‌ఐ బైరు గోపి వేగవంతమైన దర్యాప్తు,కోర్టు కానిస్టేబుల్ నాగేశ్వరరావు సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ సమన్వయం వల్లే ఈ కేసులో త్వరితగతిన తీర్పు వెలువడింది.నేరస్తులకు చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదనే బలమైన సందేశాన్ని ఈ తీర్పు సమాజానికి అందించింది.ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో,బాధితులకు సత్వర న్యాయం అందించడంలో కారేపల్లి పోలీసులు చూపిన నిబద్ధత ప్రశంసనీయం.ఇలాంటి వేగవంతమైన దర్యాప్తులు ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తాయి.

Next Story