ఆర్మీ భూములు కాపాడండి: ఆర్మీ లెఫ్ట్‌నెంట్ క‌ల్నల్‌ వినతి

by Vemula.Srinu Prasad |

ఆర్మీకి చెందిన భూమిని క‌బ్జా చేసి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని.. ఆ భూమిని కాపాడాల‌ని ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారులు హైడ్రాను ఆశ్ర‌యించారు...

ఆర్మీ భూములు కాపాడండి: ఆర్మీ లెఫ్ట్‌నెంట్ క‌ల్నల్‌ వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్మీకి చెందిన భూమిని క‌బ్జా చేసి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని.. ఆ భూమిని కాపాడాల‌ని ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారులు హైడ్రాను ఆశ్ర‌యించారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్‌ను ఆర్మీ లెఫ్ట్‌నెంట్ క‌ల్న‌ల్ జై సింగ్ క‌ల‌సి ఈమేర‌కు గురువారం విన‌తిప‌త్రం అంద‌జేశారు. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం, గ్రామంలోని జీఎల్ఆర్ స‌ర్వే నంబ‌రు 507లోని .. ఆర్మీకి చెందిన‌ ఏ-1 భూమి ఉండ‌గా అందులో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్మీకి చెందిన భూమిని ఆక్ర‌మించి జీ+2 భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నార‌ని తెలిపారు. ఆ నిర్మాణానికి అనుమ‌తులు కూడా లేవ‌ని పేర్కొన్నారు. వెంట‌నే నిర్మాణాల‌ను ఆపించి ఆ స్థ‌లాన్ని కాపాడాల‌ని కోరారు. విన‌తిప‌త్రాన్ని ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకున్న త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ్రా అధికారులను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ ను లెఫ్టినెంట్ కల్నల్ కలిసినప్పుడు హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వర రావు కూడా ఉన్నారు.

Next Story